సోషల్ మీడియాకు బానిస కాకుండా ఉండాలంటే ఏం చేయాలి

సోషల్ మీడియా కూడా ఒక రకం డ్రగ్స్ లాంటిదే. దీనికి బానిస కావడం వల్ల ఎలాంటి హాని ఉండదని మొదట అనిపించవచ్చు. కానీ అది ఊహించని పరిణామాలకు దారి తీస్తుంది. సోషల్ మీడియా అతిగా వాడటం వల్ల మీ శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. సోషల్ మీడియా వాడకాన్ని ఎలా తగ్గించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు ఎంతసేపు వాడుతున్నారో తెలుసుకోండి
సగటున ఒక వ్యక్తి రోజులో 4 గంటలు మొబైల్ ను వాడుతున్నాడు. మీ ఫోన్లో ట్రాకర్ ఉపయోగించడం వల్ల రోజులో ఎంత సేపు మొబైల్ తో గడుపుతున్నారో మీరు తెలుసుకోవచ్చు.

సోషల్ మీడియాకు హాలిడే ఇవ్వండి
వారానికి ఒకటి లేదా రెండు రోజులు సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేయకుండా ఉండేందుకు ప్రయత్నించండి.

నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి
నోటిఫికేషన్ రావడం వల్ల మొబైల్ లో సౌండ్, బజ్ లేదా ఫ్లాష్ వస్తూ ఉంటాయి దాని వల్ల మనం సులభంగా ఫోన్ ఓపెన్ చేసేందుకు ఆకర్షితులవుతాం. కాబట్టి పుష్ నోటిఫికేషన్లు రాకుండా ఆఫ్ చేసుకుంటే మీరు ఈజీగా సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించుకోగల్గుతారు.

దూరం పాటించండి
రోజులో ఎన్ని గంటలు ఫోన్ లేకుండా ఉండగలరో ప్లాన్ చేసుకోండి ఉదాహరణకు ఉదయం, డిన్నర్ చేసే సమయంలో. అలాగే బెడ్రూం లేదా బాత్ రూంలో ఫోన్ ఫ్రీ జోన్స్ ఏర్పాటు చేసుకోండి.

నిజజీవితానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి
సోషల్ మీడియాలోనే గడపకుండా వాకింగ్ ధ్యానం, స్నేహితులను కలవడం లాంటి పనులు చేయండి.

సోషల్ మీడియా వల్ల ప్రతికూలతలు
సోషల్ మీడియా వాడకం వ్యక్తిలో ప్రతికూల అనుభవాలను ప్రోత్సహిస్తుందని చాలా అధ్యయనాల్లో తేలింది. నిరాశ, ఆందోళన ఒంటరితనం, ఆత్మహత్య ఆలోచనలు, స్వీయ హింస లాంటి ఆలోచనలు కల్గుతాయని నిరూపితమైంది.

ముఖ్యమైన సమాచారం

● ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల మంది ఇంటర్నెట్, సోషల్ మీడియా వల్ల ప్రభావితం అవుతున్నారు.

● ఈ  జనరేషన్ సగటున ఒక రోజుకు 2 గంటల 55 నిమిషాలు సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు.

● 50శాతం మంది డైవింగ్ చేస్తూ సోషల్ మీడియా వాడుతున్నారు.

● టీనేజీలో ఉన్నవాళ్లు రోజుకు 5 గంటలు సోషల్ మీడియాలో గడుపుతూ నిరాశ, నిసృహకు లోనవుతున్నారు.

● రోజుకు 30 నిమిషాల పాటు మాత్రమే సోషల్ మీడియా వాడాలని పరిమితి పెట్టుకుంటే మీ ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది.





Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం