ఐదుగురితో ఎప్పుడైనా కష్టమే: పాండ్యా

ఐదుగురు బౌలర్లతో ఆడి గెలవడం ఎప్పుడైనా కష్టంగానే ఉంటుందని భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా అభిప్రాయపడ్డాడు. 'జట్టుకు ఒక్కరే విజయాన్ని అందించలేరు. ఒక్కరితో ఎక్కువగా ప్రణాళికలు వేయలేం. ఇక ఐదుగురి బౌలర్లతో ఆడితే ఎప్పుడైనా కష్టమే. ఒకరు సరిగ్గా వేయకపోయినా ఆ భారం మరొకరిపై పడుతుంది. అందుకే ఆల్రౌండర్ ఉంటే కాస్త ఉపశమనంగా ఉంటుంది' అని వివరించాడు.
ఇవాల్టి మ్యాచులో ఆరో బౌలర్ లేకపోవడం

టీమిండియాకు నష్టం చేసింది. గాయం కారణంగా చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయలేదు. అయితే తాను బౌలింగ్ పై దృష్టి పెట్టానని, సరైన సమయంలో ముందుకు వస్తానని పాండ్యా చెప్పాడు. భవిష్యత్ లో టీ20 ప్రపంచకప్ ఉందని.. అందుకు తగ్గట్లుగా ప్రిపేర్ అవుతున్నట్లు తెలిపాడు. ఇటీవల జరిగిన IPLలోనూ పాండ్యా ఒక్క ఓవర్ కూడా వేయలేదు.

Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం