సిడ్నీ వేదికగా శుక్రవారం జరిగిన భారత్-ఆస్ట్రేలియా తొలి వన్డేలో TRS నేతలు ప్రచారం నిర్వహించారు. ఆస్ట్రేలియా TRS విభాగం ప్రతినిధులు TRS ప్లకార్డులను పట్టుకుని GHMC ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.
టీమ్ఇండియా చరిత్ర సృష్టించింది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండో సారి ట్రోఫీ గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 327 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పంత్ (89*), సుందర్(22) చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 369 ఆలౌట్ భారత్ తొలి ఇన్నింగ్స్ : 336 ఆలౌట్ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 294 ఆలౌట్ భారత్ రెండో ఇన్నింగ్స్ : 329/7
సిడ్నీ: ఇంగ్లాండ్‌తో ఫిబ్రవరి 5న ఆరంభమయ్యే టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఎంపికకు వేళైంది. మంగళవారం కొత్త ఛైర్మన్ చేతన్‌శర్మ సారథ్యంలో జరిగే సెలక్షన్ కమిటీ సమావేశంలో జట్టును ప్రకటించనున్నారు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులకు భారత బృందాన్ని ఎంపిక చేయనున్నారు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ ముగిశాక పితృత్వ సెలవుపై స్వదేశానికి వచ్చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లి ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో తిరిగి పగ్గాలు చేపట్టనున్నాడు. గాయం కారణంగా ఆసీస్ వెళ్లలేకపోయిన వెటరన్ పేసర్ ఇషాంత్‌శర్మ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ముస్తాక్ అలీ టోర్నీలో ఆడుతున్న ఇషాంత్ ఫిట్నెస్ నిరూపించుకున్నాడు. అతనితో పాటు ఆసీస్ సిరీస్‌లో గాయపడి కోలుకున్న బుమ్రా, అశ్విన్ తిరిగి జట్టులోకి రానున్నారు. గాయాలతో కంగారూలతో టెస్టు సిరీస్ మధ్యలో వైదొలిగిన షమి, జడేజా, ఉమేశ్ యాదవ్, హనుమ విహారి సెలక్షన్‌కు అందుబాటులో లేరు. శార్దూల్ ఠాకూర్, నటరాజన్‌లను రిజర్వ్ పేసర్లుగా ఎంపిక చేసే అవకాశాలున్నాయి. జడేజాకు బదులు షాబాజ్ నదీమ్‌ను జట్టులోకి తీసుకు రావచ్చు. మిడిలార్డర్లో స్థానం కోసం కేఎ...
సి రీస్ ఫలితం ఎలా వచ్చినప్పటికీ విజయం మాత్రం భారత్‌దే’’.. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో టీమ్ఇండియా పోరాట పటిమ చూసిన తర్వాత చాలా మంది మాజీ ఆటగాళ్లు వ్యక్తపరిచిన అభిప్రాయమిది. అవును.. బలమైన ఆసీస్‌తో టెస్టుల్లో భారత ఆటగాళ్లు చూపిస్తున్న పోరాటం అసమానం. గాయాల కారణంగా ప్రధాన ఆటగాళ్లు దూరమైనప్పటికీ.. ద్వితీయ శ్రేణి క్రికెటర్లతో కూడిన జట్టు ప్రదర్శిస్తున్న పట్టుదల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ పోరాటానికి సరైన ఫలితం దక్కేందుకు టీమ్ఇండియాకు మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. చివరి టెస్టు ఆఖరి రోజు అదే తెగువ, పట్టుదల చూపి సిరీస్‌ను సగర్వంగా ముగించాలని జట్టు కోరుకుంటోంది. ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా భారత్‌కు కలిగే నష్టమేమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే సిరీస్ 1-1తో సమంగా ఉంది కాబట్టి ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా.. చివరగా బోర్డర్-గావస్కర్ (2018-19) సిరీస్‌లో విజేతగా నిలిచిన భారత్ దగ్గరే ఆ ట్రోఫీ ఉంటుంది. కానీ ఈ మ్యాచ్ నెగ్గకపోతే మాత్రం ఆసీస్ పరువు కచ్చితంగా పోతుంది. ఎందుకంటే గత 31 టెస్టుల్లో తమకు పరాజయం తెలీని గబ్బా మైదానంలో.. అత్యుత్తమ ఎలెవన్ అందుబాటులో లేని భారత్‌తో ...
Comments
Post a Comment