టీ20 ర్యాంకింగ్స్లో టాపర్గా ఇంగ్లాండ్
ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు దూసుకెళ్తోంది. దక్షిణాఫ్రికాపై తాజాగా మూడు టీ20ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లీష్ సేన. తాజా ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం కైవసం చేసుకుంది. 275 రేటింగ్ పాయింట్లతో పట్టికలో ఇంగ్లాండ్ టాపర్గా నిలిచింది. ఆస్ట్రేలియా రెండో స్థానానికి పడిపోయింది ఈ జాబితాలో భారత జట్టు మూడో స్థానంలో నిలవగా.. తర్వాతి రెండు ర్యాంక్ ల్లో పాక్, దక్షిణాఫ్రికా కొనసాగుతున్నాయి.
Comments
Post a Comment