ధోనినే ఫాలో అవుతున్నా: జడేజా
మూడో వన్డేలో తాను ఆడిన కీలక ఇన్నింగ్స్ క్రెడిట్ అంతా ధోనిదేనని జడేజా అన్నాడు. తన బ్యాటింగ్ మెరుగవడానికి ప్రధాన కారణం మహీనే అని తెలిపాడు. 'ధోని భాయ్ తో టీమ్ ఇండియాకు, CSKకు చాలాకాలంగా ఆడుతున్నా. అతను ఎప్పుడూ భాగస్వామ్యాలపై ఎక్కువ ఫోకస్ చేస్తాడు. ఒక్కసారి బ్యాట్స్ మెన్ క్రీజ్ లో సెట్ అయ్యాక భారీ షాట్లు ఆడొచ్చని చెబుతుంటాడు. అదే నేను ఫాలో అవుతున్నా. ధోనితో ఆడటాన్ని ఆస్వాదిస్తాను' అని జడేజా అన్నాడు.
Comments
Post a Comment