పంత్ మెరుపు సెంచరీ.. చోటు దొరికేనా
ఆస్ట్రేలియా-Aతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ లో రెండోరోజు భారత్ చెలరేగింది. రిషబ్ పంత్ మెరుపు శతకంతో దుమ్ములేపాడు. 86 పరుగుల ఆధిక్యంతో నేడు ఆట ప్రారంభించిన భారత్ 386/4 స్కోరు చేసింది. దీంతో టీమిండియా ఆధిక్యం 472 రన్స్ కి చేరింది. పంత్ 103*(73 బంతుల్లో 9X4, 6x6) విధ్వంసం సృష్టించాడు. దీంతో సాహాకు బదులుగా పంత్ టెస్ట్ తుదిజట్టులోకి రావొచ్చని సమాచారం. అటు హనుమవిహారి సెంచరీ (104", 194 బాల్స్) కొట్టాడు.
Comments
Post a Comment