రతన్ టాటా నేను కాదంటోన్న మాధవన్
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా బయోపిక్ పై క్లారిటీ ఇచ్చారు హీరో మాధవన్. ఇందులో తాను నటించడం లేదని స్పష్టం చేశారు. రతన్ టాటా బయోపిక్ తెరకెక్కనుందని, మాధవన్ నటిస్తున్నారని సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. ఓ పోస్టర్ కూడా వైరల్ అవుతోంది. 'దురదృష్టవశాత్తు ఇది నిజం కాదు' అని మాధవన్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ఇంతవరకు తన దగ్గరికి రాలేదని.. కనీసం చర్చ కూడా జరగలేదని మాధవన్ ట్వీట్ చేశారు.
Comments
Post a Comment