ఐపీఎల్ 14కు డేల్ స్టెయిన్ దూరం
IPL-14 సీజన్ కు దూరమవ్వనున్నాడు.. దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్. కొద్ది కాలం క్రికెట్ కు దూరంగా ఉండాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ల డేల్ స్టెయిన్. కొంతకాలం విశ్రాంతి తీసుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు. ఐపీఎల్లో 95 మ్యాచులు ఆడిన స్టెయిన్.. 6.91 ఎకానమీతో 97 వికెట్లు పడగొట్టాడు.
Comments
Post a Comment