నోటికి పనిచెప్పిన లబుషేన్.. రోహిత్, శుభ్‌మన్‌లను విసిగించిన ఆసీస్ బ్యాట్స్‌మన్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇక్కడికి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్‌లో మూడో టెస్టు జరుగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. అంతకుముందు ఆస్ట్రేలియా తన తొలి ఇన్సింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ బ్యాటింగ్‌కు దిగింది.


 టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో షార్ట్ పొజిషన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఆసీస్ ఆటగాడు మార్నస్ లబుషేన్ నోటికి పనిచెప్పాడు. వారి ఏకాగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. అదే పనిగా వారిని విసిగించాడు. తొలుత నీకు ఇష్టమైన ఆటగాడు ఎవరంటూ గిల్‌ను ప్రశ్నించాడు. స్పందించిన గిల్.. తర్వాత చెబుతానంటూ సమాధానం చెప్పాడు. అయినా తగ్గని లబుషేన్.. ఈ బంతి ఆడిన తర్వాత చెబువాతా? అని రెట్టించాడు. అక్కడితో ఆగక, సచిన్ అంటే ఇష్టమా? లేక, విరాట్‌ అంటే ఇష్టమా? అని రెట్టించాడు. అయితే, అతడి మాటలను పట్టించుకోకుండా గిల్ బ్యాటింగ్‌లో మునిగిపోయాడు. 


ఆ తర్వాత రోహిత్ వంతు వచ్చింది. రోహిత్ స్ట్రైకింగ్‌కు వచ్చినప్పుడు లుబషేన్ మళ్లీ మొదలుపెట్టాడు. ‘క్వారంటైన్‌లో ఏం చేశావేంటి?’’ అని ప్రశ్నించాడు. అతడి వ్యూహాన్ని అర్థం చేసుకున్న రోహిత్ అదేమీ పట్టించుకోకుండా బ్యాటింగ్ చేశాడు. 


Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం