సచిన్, కోహ్లీ రికార్డును బద్దలుగొట్టిన స్మిత్

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమైన స్మిత్ ఈమ్యాచ్‌లో కసితో ఆడాడు. మొత్తం 226 బంతులు ఎదుర్కొన్న స్మిత్ 16 ఫోర్లతో 131 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ సెంచరీతో స్మిత్ ఘనమైన రికార్డును తన ఖాతాలో వేసుకోవడంతోపాటు సచిన్, కోహ్లీ రికార్డులను బద్దలుగొట్టాడు. 


టెస్టుల్లో స్మిత్‌కు ఇది 27వ సెంచరీ కాగా, అన్నే శతకాలు నమోదు చేసిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ సరసన చేరాడు. అంతేకాకుండా, అత్యంత వేగంగా ఈ మైలు రాయిని చేరుకున్న రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. స్మిత్ 136 ఇన్సింగ్స్‌లలో 27 శతకాలు నమోదు చేయగా సచిన్, కోహ్లీ 141 ఇన్సింగ్స్‌లలో ఈ ఘనత అందుకున్నారు. ఇక, ఆసీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ సర్ డాన్ బ్రాడ్‌మన్ ఈ విషయంలో అందరికంటే ముందున్నాడు. కేవలం 70 ఇన్సింగ్స్‌లలోనే 27 సెంచరీలు బాదాడు. కాగా, పరుగుల విషయంలోనూ స్మిత్.. కోహ్లీని దాటేశాడు. టెస్టుల్లో ఇప్పటి వరకు స్మిత్ 7,368 పరుగులు చేయగా, కోహ్లీ 7,318 పరుగులతో ఉన్నాడు. 

Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం