కేటీఆర్‌తో సిడ్నీ హీరో
టీమ్‌ఇండియా టెస్టు జట్టు ఆటగాడు గాదె హనుమ విహారి సోమవారం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను కలిశాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీలో మూడో టెస్టులో అద్భుత పోరాటంతో ప్రశంసలందుకున్న విహారి తొడ కండరాల గాయం కారణంగా చివరి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అనంతరం స్వదేశానికి తిరిగొచ్చిన విహారి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశాడు. విహారితో పాటు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు తరుణ్ కోన, శ్రీకృష్ణప్రియ, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. విహారి, తరుణ్, శ్రీకృష్ణప్రియలను సత్కరించిన కేటీఆర్.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రీడాకారులకు అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Post a Comment